![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -481 లో.. అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే మీరా వచ్చి తింటుంది. తన ట్యాబ్లెట్స్ అయిపోయాయని మధుని తీసుకురమ్మంటుంది. ఇంట్లో ఎవరూ సేవలు చేయడానికి లేరని మధు అంటాడు. ఇక మీరాని చూసి ఆదర్శ్ కోపంతో లేచి వెళ్లిపోతాడు. నా కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడని తన గురించి ఆలోచించమని మిగతావాళ్ళతో మీరా చెప్తుంది.
ఇదిగో అమ్మాయ్.. వారసుడు వారసుడు అని అన్నిసార్లు అనకు. అసలు నీ బిడ్డకు మురారి తండ్రి అంటే ఎవరు నమ్మడం లేదిక్కడ అని రజినీ అనగా.. నమ్మరు. కలికాలం కదా. సాక్ష్యాలు ఉంటేనే నమ్ముతారు. డీఎన్ఏ టెస్ట్ చేస్తే అప్పుడు నమ్ముతారులే. అసలు మురారినే ఉంటే ఇంత ఇబ్బందే ఉండేది కాదు. నా బిడ్డకు తండ్రి అని తనే ఒప్పుకునేవాడు. అయినా మిమల్ని కాదు మురారిని అనాలి బిడ్డను మోస్తున్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటాను అని మాట ఇచ్చి చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. మీరేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మురారి వస్తాడు కదా అప్పుడు నిజం చెప్తాడు. అంత వరకు నన్ను నేనే చూసుకుంటాను. నా ట్యాబ్లెట్స్ నేనే తెచ్చుకుంటానని మీరా అంటుంది. ఇక కాసేపటికి ఆదర్శ్ బాగా తాగేసి రివాల్వర్ పట్టుకొని వచ్చి మీరాకి గురిపెడతాడు. దాంతో ఇంట్లోని వాళ్ళంతా అదర్శ్ ని ఆపుతారు. చూడు నువ్వు చేసిన పనికి అందరూ కలిసి నిన్ను చంపేయాలి కానీ ఇంకా జాలి చూపిస్తున్నారు. ఇది.. ఇది నా కుటుంబం.. నా కుటుంబాన్ని మోసం చేయాలి అనుకుంటున్నావా. పిన్ని మురారి వల్లే ఇది తల్లి అయ్యానని అంటే ఆవేశంలో మురారిని తిట్టాలనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నింటికీ ఇదే కారణమనిపిస్తుంది. పోనీ మురారీనే తప్పు చేశాడనుకుందాం. వాళ్లు వాళ్లు ఏడ్వాలి కదా నా జీవితంతో ఎందుకు ఆడుకుంది. నాతో పెళ్లి అంటే సరే అంది. ఇలాగే మురారిని కూడా మాయ చేసి ఉంటుంది. అసలు మురారి కనిపించకుండా పోవడానికి కారణం ఇదే. అందుకే డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని అంత గట్టిగా చెప్తుంది. చెప్పవే మురారి ఎక్కడ చంపేస్తా దాన్ని ఆదర్శ్ అంటాడు.
మరోవైపు కృష్ణ, ప్రభాకర్ భార్య, భవాని, ప్రభాకర్ కలిసి గుడికి వెళ్తారు. ఇక మురారి కనపడటం లేదనే విషయాన్ని కృష్ణతో చెప్పలేకపోతుంది భవాని. ముకుంద మాటలు, సవాళ్లు అన్నీ కృష్ణకి గుర్తొచ్చి కళ్లు తిరిగి పడిపోతుంది. దాంతో కంగారుపడిన ప్రభాకర్, శాకుంతల, భవాని.. కృష్ణ ముఖంపై నీళ్లు జల్లి లేపుతారు. నీళ్లు తాగించి.. జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ సమయంలో మురారీ కనిపించడం లేదంటే ప్రాణాలే వదిలేస్తుందేమో ఈ తింగరిది అని భవాని మనసులో అనుకొని నిజం చెప్పకుండా ఉండిపోతుంది. ఇక రేవతి కాల్ చేసి.. మీరాను అదర్శ్ చంపబోయిన విషయం మొత్తం భవానికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |